గురి లేని నాడు గమ్మత్తు గా వుంటుంది.
సరి తేల్చుకునే రోజు దరిద్రం వెక్కిరిస్తుంది.
సమయం భవిష్యత్ వైపు పరిగెడుతూ,
పనికి మాలిన ఆలోచనల్ని రేపుతుంది.
సహకరిస్తారనుకున్న వాళ్ళు సందేహామైనారు.
ఆత్మీయులనుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఎగిసి పడుతున్న కెరటాన్ని చూస్తే చాలదు?!
ప్రయత్నిస్తు పరుగులు పెట్టాలి ఇక నువ్వు.
అవకాశo కోసం ఎదురుచుడకు మిత్రమా !
తూట్లు పడుతున్న నీ మనసే నీ నేస్తం.
అవమానాలను ఆభరణాలుగా మార్చుకో ,
ఒకరి తోడు ఎందాక? ఒకరి నీడ ఎందాక?.
రానున్న భవిత కోసం రారాజు నువ్వే కావాలి .
వెంట వస్తున్న నీ ఆత్మీయులను గుర్తించు
ఆకరి క్షణం వరకు సమయాన్ని విడవకు
ఒక్క క్షణం లో అదృశ్యమవ్వాలి నీ గత జీవితం.
సరి తేల్చుకునే రోజు దరిద్రం వెక్కిరిస్తుంది.
సమయం భవిష్యత్ వైపు పరిగెడుతూ,
పనికి మాలిన ఆలోచనల్ని రేపుతుంది.
సహకరిస్తారనుకున్న వాళ్ళు సందేహామైనారు.
ఆత్మీయులనుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఎగిసి పడుతున్న కెరటాన్ని చూస్తే చాలదు?!
ప్రయత్నిస్తు పరుగులు పెట్టాలి ఇక నువ్వు.
అవకాశo కోసం ఎదురుచుడకు మిత్రమా !
తూట్లు పడుతున్న నీ మనసే నీ నేస్తం.
అవమానాలను ఆభరణాలుగా మార్చుకో ,
ఒకరి తోడు ఎందాక? ఒకరి నీడ ఎందాక?.
రానున్న భవిత కోసం రారాజు నువ్వే కావాలి .
వెంట వస్తున్న నీ ఆత్మీయులను గుర్తించు
ఆకరి క్షణం వరకు సమయాన్ని విడవకు
ఒక్క క్షణం లో అదృశ్యమవ్వాలి నీ గత జీవితం.